సొను సూద్ కరోనా కాలంలో రియల్ హిరో ఈ పేరు వింటే గుర్తొచ్చేది టాలీవుడ్ తెరపై కనిపించే
విలన్. కానీ లాక్డౌన్ తరువాత వెండితెర విలన్ కాస్తా నిజ జీవితంలో హీరో అయిపోయాడు. దేశ
వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వలస కూలీలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అలాంటి వారికి ప్రత్యక్ష్య దైవంగా నిలిచాడు సోనుసూద్. కేంద్ర ప్రభుత్వం కూడా అతను చేసినంతగా చేయలేకపోయింది. ఎక్కడ కష్టం వుందో అక్కడ తానున్నానని భరోసా నివ్వడమే కాకుండా తమ గమ్యాలను చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు అండగా నిలిచారు సోనుసూద్. దీంతో అతను జాతీయ స్థాయిలో హీరో అయిపోయాడు. ఇప్పుడ స్టార్ హీరోకు కూడా లేని ఫాలోయింగ్ అతని సొంతం. ఎక్కడికి వెళ్ళినా అయనని అభిమానులు చుట్టుముడుతున్నారు. తాజాగా సోనూసూద్ ఒక విడీయో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అందులో సోనూ సూద్ ఫోటోతో ఉండి విలేజ్ అట్మాస్పియర్ ఉంది. సోనూ సూద్ ఈ వీడియో లో గ్రామల గొప్పతనం గురించ వారి కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. గ్రామాలు చిన్నవే కావొచ్చు
కాని కళలు పెద్దవి వారు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు సహకరించాలి అందుకు గ్రామలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఈ విడీయో పోస్ట్ చేస్తూ గ్రామలను పట్టణాలుగా మార్చే సమయం వచ్చింది అని చెప్పుకొచ్చారు.