కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు సోనూసూద్. ఇక ఆయన ఇలాంటి సహాయలు చేయడం వల్ల వచ్చిన సంతృప్తిని తన ఆత్మ కథ ‘ఐ యామ్ నో మెసయ్య’ బుక్ ద్వారా మన ముందుకు తీసుకొని వచ్చారు. అయితే సోనూసూద్ ఆయన బుక్ ని అమితాబ్ బచ్చన్ గారికి మీలో ఎవరు కోటీశ్వరుడు హిందీ కె.బి.సిలో ప్రత్యేకంగా అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోనూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కొత్త సంవత్సరాన్ని ఇంతకన్నా గొప్పగా మొదలుపెట్టలేను ఏమో... అమితాబ్ బచ్చన్ గారు నా బుక్ ని విడుదల చేయడం కె.బి.సి షోలో చూడండి అని మీ అందరికి ఈ సంవత్సరం మంచి జరగాలని మీరు చేసే పనుల్లో బెస్ట్ గా ఉండాలి అని ఆయన విషెస్ చెప్పారు. కాగా, పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా సోనూసూద్ ఇప్పటికే ఈ పుస్తకాన్ని ఆచార్య సెట్లో అందించారు. ఈ బుక్ తెలుగు హిందీ రెండు భాషల్లో విడుదల చేసారు. ఒక పక్క సినిమాలు ఇంకో పక్క సమాజ సేవ కార్యక్రమాలతో సోను సూద్ రోజు రోజుకి దేశమంతట అభిమానులని పొందుతున్నారు.