కొడుకుతో శాంటగా సోనూ సూద్

విలన్ పాత్రలతో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సోనుసూద్. కానీ ఇప్పుడు అతనొక నేషనల్ ఐకాన్. సెలబ్రిటీల్లో ఆయన స్థానం ప్రత్యేకమని ప్రజలు భావిస్తున్నారు కరోనా లాక్డౌన్ సమయంలో దేశం మొత్తం మీద అందరి చేత రియల్ హీరో అని కొనియాడబడ్డాడు అంటే అది కేవలం నటుడు సోనూ సూద్ అనే చెప్పాలి. ఈయన లాక్ డౌన్ సమయంలో చేసిన మంచి పనులు సేవా కార్యక్రమాలు ఈయనకు ఎనలేని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆ మధ్య షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన సోనూసూద్ ను చిరంజీవి సత్కరించారు కూడా. అయితే తాజాగా సోనూ సూద్ హిందుస్థాన్ టైమ్స్ బ్రంచ్ లైఫ్ స్టైల్ మ్యాగ్జిన్ లో కవర్ పోటో లో శాంటగా వచ్చాడు. నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండగ సంధర్బంగా శాంటగా సోనూ సూద్ ఫోటో ను కవర్ పేజిలో వేశారు. సోనూ సూద్ తో పాటు ఆయన కూమారుడు ఇషాన్ సూద్ కూడా ఉన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ స్కూటర్ పై గిఫ్ట్స్ పట్టుకుని వస్తున్నారు. రెడ్ ఆండ్ వైట్ టీ షర్ట్స్ లో తండ్రి కొడుకులు ఇద్దరూ అదరగొట్టారు. క్రిస్మస్ పండుగకి గిప్ట్స్ ఇస్తున్నారు తండ్రి కొడుకులు. ఈ ఫోటో సోనూ సూద్ తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ “ట్విన్నింగ్ విన్నింగ్” ఆన్ హెచ్.టి బ్రంచ్ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.