
తెలుగు సినిమా చరిత్రలో సోగ్గాడు అంటే గుర్తొచ్చే మొదటి మరియు చివరి వ్యక్తి శోభన్ బాబు గారు. ఆయన అభిమానులు ఇప్పటి ఆయన అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. టాలీవుడ్ లో శోభన్ బాబు గారికి ఉన్నంత అమ్మాయిల అభిమానం ఎవరికి ఉండదేమో . ఆయన సినిమాలు వస్తే అప్పట్లో అమ్మాయిలు థియేటర్స్ కి ఎక్కువగా వచ్చేవారట. అయితే శోభన్ బాబు గారికి సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో బయట బిజినెస్ లలో కూడా అంతే పెరు ఉంది.

ప్రస్తుతం ఆయన ఆస్థులన్ని కలిపితే ఆయన కన్నా ధనవంతుడు ఎక్కడ ఉండరని ఆయనకి బాగా ఇష్టమైన మిత్రుడు మురళీ మోహన్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు 80 వేల కోట్లు ఉంటుందని అంచనా అంటున్నారని మురళి మోహన్ గారు అన్నారు.

అలాగే శోభన్ బాబు గారు బయట కనిపించడానికి బాగా పిసినారిలా ఉంటారు అని కానీ ఆయనకి కావలసిన వారికి మాత్రం ఎలాంటి సహాయమైన దగ్గరుండి చేస్తారని ఆయన నమ్మకస్తులు చెప్తారు. అలా శోభన్ బాబు గారి దగ్గర పని చేసిన డ్రైవర్ కూడా ప్రస్తుతం కోటీశ్వరుడు అని అనుకుంటున్నారు. ఈ రోజుకు కూడా చెన్నై లో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాల ఉన్నాయట. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన సన్నిహితులకు చెప్పేవాడని..

అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు మురళీ మోహన్. మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని.. దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి అంటూ ఓ సినీ విశ్లేషకుడు తెలిపాడు. శోభన్ బాబు గారు తన ఆస్తి విషయంలో చాలా కఠినంగా ఉంటారు అని కానీ మిగతావారిది ఒక్క రూపాయి కూడా ఆయన ముట్టుకొడు అని ఆయన గురించి తెలిసిన వారు అంటారు.