
రోజురోజుకి జనాల్లో విపరీత ధోరణి ఎక్కువైపోతోంది. మన చుటూ జరిగే విషయాలూ ఇందుకు మినహాయింపు కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా రాద్ధాంతాలు చేస్తున్నారు. మితిమీరిన అభిమానంతో విచక్షణను మర్చిపోతున్నారు. దీనికి ప్రభుత్వ నాయకులూ మినహాయింపు కాదు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ తమను విమర్శించే వారిని మానసికంగా దెబ్బతీయాలనే నీచమైన ఆలోచనలతో వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను బహిర్గతం చేయటం, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు.
When you are voted out of power one day, this country will truly be vaccinated. Its coming. We will still be here... at least to remind you of this tweet. https://t.co/VTT44SEeHW
— Siddharth (@Actor_Siddharth) April 23, 2021
ఇలాంటి చేదు అనుభవం నటుడు సిద్ధార్థ్ కి ఎదురయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన ప్రభుత్వ పొరపాట్లను, తప్పిదాలను విమర్శిస్తూ ఉంటారు. అలా విమర్శించడం ఒకరకంగా మంచిదే తాము చేసే పొరపాట్లు ప్రభుత్వానికి తెలియకపోవచ్చు ఇలా విమర్శించే వాళ్ళు లేకపోతే తాము చేస్తుంది కరెక్టే అనే ధోరణిలో ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. గతంలో కూడా సిద్ధార్థ్ పలు నిర్ణయాలపై తన గొంతును విప్పాడు. రైతుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతోమందికి ఆయన తన మద్దతును తెలిపాడు.
This is one of many social media posts by BJP TN members leaking my number yesterday and telling people to attack and harass me.
— Siddharth (@Actor_Siddharth) April 29, 2021
"Ivan inimela vaaye thirakka koodathu" (this fellow must never open his mouth again)
We might survive Covid. Will we survive these people? pic.twitter.com/dYOQMsEewi
ఇప్పుడు కూడా బి.జే.పి చేసిన ఒక ట్వీట్ ని విమర్శిస్తూ అయన దానిని రీట్వీట్ చేసారు. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి గొడ్డు పరిస్థితిలో ఎలక్షన్స్ నిర్వహించడంపై పెద్ద రచ్చె జరిగింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోకుండా ర్యాలీలు నిర్వహించారు. ఇక తాము అధికారంలోకి వస్తే అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బి.జే.పి ప్రకటించింది. దీన్ని విమర్శిస్తూ సిద్ధార్థ్ మీరు అధికారంలో నుండి దిగిపోతే దేశం మొత్తం వ్యాక్సినేట్ అవుతుంది అని ట్వీట్ చేసాడు. ఆయన అలా ట్వీట్ చేయడం అవమానంగా భావించిన బి.జే.పి కార్యకర్తలు ఆయన ఫోన్ నెం ను లీక్ చేసి ఆయనకు కాల్ చేసి బెదిరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు కాల్ చేసిన వారి కాల్ రికార్డ్స్ పోలీసులకి అందచేసినట్లు తెలియచేసారు.