మళ్ళీ వారి చర్యలపై అసహనంతో ఫైర్

రీసెంట్ గా ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావించినందుకు ఆయన్ను ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని కొందరు బెదిరించిన విషయం తెలిసిందే. అయితే తనకు వచ్చిన బెదిరింపులను ప్రతిఘటిస్తూ, ఆ చర్యలను చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలిసుల్ని కోరిన సిద్ధార్థ్ మరో సారి ప్రభుత్వాన్ని ఏకి పారేసాడు. నిత్యం జరుగుతున్న ఘోరాలపై గళం విప్పుతూ ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ పేషంట్లకు ఆక్సీజన్ బెడ్స్ లేకపోవడం పై స్పందించిన సిద్దార్థ్ ప్రభుత్వ వైఫల్యంపై మరోసారి ధ్వజమెత్తారు.

తన ట్విటర్ హ్యాండిల్ లో ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ “ రోజూ ఆక్సీజన్ లేక ఎందరో ప్రజలు మరణిస్తుంటే భజన పరులు మాత్రం అది తమ నాయకుడ్ని దెబ్బ తీసేందుకు చేస్తున్న కుట్ర అని అంటున్నారు. ఎందుకని సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. 20000 కోట్లు కర్చు పెట్టి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్, ఇతర ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు సమానమైనది.” అంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచారు.

ప్రస్తుతం సిద్ధార్థ్ మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. అజేయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. వీరికి జంటగా అనూ ఇమ్మాన్యుయెల్, అదితి రావు హైదరి నాయికలుగా నటిస్తునారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా సిద్ధార్థ్ కి సరైన హిట్ లేదు. ఒకప్పుడు స్టార్ స్టేటస్ తో ఒక వెలుగు వెలిగిన సిద్దార్థ్ ఆ తర్వాత హిట్స్ లేక వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రంతో మళ్ళి మునుపటి క్రేజ్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి మరి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.