ఆసక్తికర టైటిల్ తో వచ్చిన శివ కందుకూరి

యువ హీరో శివ కందుకూరి తర్వాతి సినిమా మొదలైంది. చూసి చూడంగానే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శివ కందుకూరి. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు ఈయన. మొదటి సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా శివ మంచి పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసాడు. ఆ తర్వాత గమనం అనే చిత్రంలో నటించాడు. అయితే కోవిడ్ వలన ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. గమనం చిత్రంలో శ్రియ శరన్, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో నటించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించాడు. అలాగే ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఇక అసలు విషయానికొస్తే శివ కందుకూరి మూడో చిత్రం ఈరోజు లాంచ్ అయింది. ఈ చిత్రానికి చేతక్ శ్రీను అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇందులో హీరో డెలివరీ బాయ్ పాత్రలో కనిపించబోతున్నాడని పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకు దర్శకుడు కాగా రవి చరణ్ మెరిపో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.