

యంగ్ హీరో శర్వానంద్ యమా స్పీడు మీదున్నాడు. ఇటీవలే తన 29వ చిత్రం ‘శ్రీకారం’ షూటింగ్ ను పూర్తి చేసిన శర్వానంద్, ఇప్పుడు తన 30వ సినిమా షూటింగ్ ను కూడా ముగించాడు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. శర్వానంద్ సరసన రీతూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అమల అక్కినేని కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. పెళ్ళి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించడం విశేషం. జేక్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతేడాది ఖైదీ వంటి విభిన్నమైన సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలుపెట్టి, టైటిల్ ను కూడా వచ్చే నెలలో రివీల్ చేస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. శర్వానంద్ దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ అనే చిత్రం మొదలుపెట్టాల్సి ఉంది.
. @ImSharwanand’s #Sharwa30 in @DreamWarriorpic (Khaidi producers) wraps up the complete shoot.
— BARaju (@baraju_SuperHit) November 24, 2020
Others ⭐️ing @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i
Directed by #ShreeKarthick
Music #Jakebejoy
Dialogues @TharunBhasckerD
DOP Sujeeth Sarang pic.twitter.com/ucG3gouldC