సత్య దేవ్ సినిమాల్లోనే కాదు సోషల్ మిడియాలో కూడా అదరగొడుతున్నాడు. తన లుక్స్ తో తన ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు. మొదటగా 2011తో ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. సత్యదేవ్ పెద్ద స్టార్ హీరో కాకపోయిన తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో బ్లఫ్ మాస్టర్లా అందరినీ తన మాయలో పడేసాడు. ఈ సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే. అదే విధంగా మరెన్నో సినిమాలలో సైడ్ పాత్రల్లో కనిపిస్తూ వచ్చాడు. తరువాత బ్లఫ్ మాస్టర్, ఘాజీ, అంతరిక్షం వంటి కొత్త తరహా సినిమాలలో నటించి ప్రధాన్యం పొందాడు. కేవలం సినిమాలే కాకుండా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ కనిపించాడు. అయితే లాక్ డౌన్ సమయంలో కూడా రెండు సినిమాలను ఓ.టీ.టీ వేదికగా విడుదల చేశాడు. వాటిలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం మంచి స్పందన పొందింది. అంతే కాకుండా తన తాజా చిత్రం గువ్వ గోరింకను కూడా ఓ.టీ.టీలో విడుదల చేసేందుకు చూస్తున్నాడు. అయితే సత్యదేవ్ నటించిన తిమ్మరుసు అభిమానుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సత్యదేవ్ తన కొత్త లుక్ లో అవతారమిచ్చాడు. ఈ అవతారం సినిమా కోసం కాదు ఫోటోషూట్ లో జరిగంది. ఈ ఫోటో లో సత్యదేవ్ బైక్ పై కూర్చుని టోన్ జీన్స్, వైట్ టీషర్ట్ తో ట్రెండీ లుక్ లో వున్నాడు.