‘థాంక్ యు బ్రదర్’ అంటున్న అనసూయ

‘రంగస్థలం’ సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. ‘థాంక్ యు బ్రదర్’ పేరుతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా క్యాస్ట్‌ రివీల్‌ పోస్టర్‌ని హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. అసలు ఈ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంది అని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఈ పోస్టర్‌లో ఒక  లిఫ్ట్‌లో అనసూయ, విరాజ్‌ ఎడముఖం, పెడముఖం పెట్టుకొని నిలబడి కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ థాంక్ యు బ్రదర్ అని ఎవరు ఎవరికి చెప్తునారో తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు అగాల్సిందే. ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ టైటిల్‌ లుక్‌ని తాజాగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ పని చేస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టి ని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.