
యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ ఫన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ ఇటీవలే పూర్తైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారం నుండి థియేటర్లు పూర్తిగా తెరుచుకోనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత థియేటర్లో విడుదలయ్యే చిత్రం ఇదే కావొచ్చు అని గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ షికార్లు చేసాయి. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదలవుతుందని అన్నారు. అయితే ఇందులో కొంతే నిజముంది. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది కానీ ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్లలోనే విడుదల కానుంది. దీనిపై పూర్తి క్లారిటీని ప్రొడక్షన్ హౌస్ ఇచ్చింది. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
DECEMBER 2020 RELEASE... #Zee Studios partners with producer BVSN Prasad... #Telugu film #SoloBrathukeSoBetter - starring #SaiDharamTej and #NabhaNatesh - to release in *cinemas* in Dec 2020... Directed by Subbu. pic.twitter.com/7AuHlxcxo9
— taran adarsh (@taran_adarsh) November 18, 2020