
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ బ్యానర్ పై రూపొందిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయ ధరమ్ తేజ్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉంది అలాగే సాయిధరమ్ తేజ్ కూడా ‘చిత్ర లహరి’తో మంచి హిట్ కొట్టాడు. ‘సోలో బ్రతుకే సో బేటర్’ సినిమాతో సుబ్బు డైరెక్టర్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ సి.దిలిప్ కెమారమెన్ గా, నవీన్ నూలీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తొలుత మే 1న సినిమాను విడుదల చేయాలని భావించినా లాక్డౌన్ కారణంగా వాయిదా పడగా జీ తాజా ప్రకటనతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మీద ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ సినిమాలోని పాటల కారణం అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని పాటలు సుపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని హే ఇది నేనేనా పాట రికార్డ్ వ్యూస్ సంపాందంచింది. ఈ పాటకి 25 మిలియన్ వ్యూస్ దాటాయి. ఈ పాటకి తమన్ ట్యూన్ స్వర పరచగా రఘురామ్ లిరిక్స్ అందించాడు. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
#25MForHeyIdiNenena #HeyIdiNenena rocking charts and hearts with over 2⃣5⃣MILLION views!
— BARaju (@baraju_SuperHit) November 25, 2020
➡️ https://t.co/gw8JZ4b6eF@IamSaiDharamTej @NabhaNatesh @SVCCofficial @BvsnP @MusicThaman @subbucinema @sidsriram @SonyMusicSouth#SoloBrathukeSoBetter #SBSB pic.twitter.com/6waEcCoASm