Dubbing in process #KRACK pic.twitter.com/qDfMHseqgS
— Ravi Teja (@RaviTeja_offl) December 29, 2020
మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం క్రాక్. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజేసారు. ఇక క్రాక్ కు సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే క్రాక్ నుండి మూడు పాటలు విడుదలవ్వగా వీటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక చిత్ర ట్రైలర్ ను న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదల చేస్తారు. తాజా సమాచారం ప్రకారం క్రాక్ డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. రవితేజ డబ్బింగ్ చెబుతున్నట్లుగా ట్విట్టర్ లో రివీల్ చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను రివీల్ చేసాడు కూడా. రవితేజ సరసన శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. క్రాక్ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు అన్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని రవితేజ క్రాక్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాడు. క్రాక్ తర్వాత రవితేజ చేస్తోన్న సినిమా ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.