ఈ కాంబోలో మళ్ళీ సినిమా వస్తుందా?

హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం మనం తరచూ చూస్తుంటాం. ఎన్టీఅర్, ఏఎన్నార్ ల కాలం నుండి ఇది కొనసాగుతూ వస్తోంది. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి గారు ఎక్కువగా తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో మళ్ళీ సినిమాలు చేసేవారు. కోదండరామి రెడ్డి, విజయ బాపినీడు లాంటి వారితో ఆయన ఎక్కువ సినిమాలు చేసారు. ఇక పోతే ఇప్పటి హీరోల్లో తన కంటూ సెపరేట్ రూట్ ని, మార్కెట్ ని ఏర్పరచుకున్న నటుడు రవితేజ. ఆయన ఎక్కువగా సినిమాలు చేసింది డ్యాషింగ్ డైరెక్టర్ పూరితో.

వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’. అప్పటి వరకూ రవితేజ సపోర్టింగ్ రోల్స్, మల్టీస్టారర్స్ మాత్రమె చేసున్నారు. హీరోగా చేసిన ఒక సినిమా అంతగా ఆడలేదు. ఈ చిత్ర విజయంతో ఆయనకు హీరోగా మార్కెట్ ఏర్పడింది.

ఆ తర్వాత వచ్చిందే ‘ఇడియట్’. 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రిలీజ్ అవ్వగా 2002లో ఇడియట్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకూ ఒక మోస్తారుగా ఉన్న రవితేజ గ్రాఫ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. దీంతో వీరిద్దరిది హిట్ కాంబో అని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఆ తర్వాత వచ్చిన సినిమా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’. ఈ చిత్రం 2003లో విడుదల అయ్యింది. వీరి సక్సస్ ట్రాక్ ను ఈ చిత్రం కొనసాగించింది. ఈ చిత్రంతో రవితేజ మార్క్ మరోసారి తెరపై కనిపించింది. దీంతో వీరు హ్యాట్రిక్ ను అందుకున్నారు.

2008లో భారి అంచనాలతో విడుదల అయిన చిత్రం ‘నేనింతే’. ఈ చిత్రం అనుకోని విధంగా ఫ్లాప్ అయ్యింది. కానీ రవితేజ నటనకు అందరూ ఫిదా అయ్యారు.

2012లో విడుదలైన చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’. ఈ చిత్రం నేనింతే సినిమాని మించిన డిజాస్టర్. అసలే ఫ్లాపుల్లో ఉన్న రవితేజను మరింత ఇరకాటంలో పడేసింది. అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకూ వీరి నుండి మరో సినిమా రాలేదు. వీరి నుండి సినిమా ఎప్పుడు వస్తుందో అని ఇద్దరి ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారో లేదో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.