జిమ్ లో కసరత్తులు చేస్తోన్న మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు అనుకున్న విధంగా కెరీర్ లో సక్సెస్ వరించలేదు. వరసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన డిస్కో రాజా కూడా పెద్ద ప్లాప్ గా నిలిచింది. అయితే సినిమాలు ప్లాప్ అవుతున్నా రవితేజకు సినిమా ఆఫర్ల పరంగా కొదవేం లేదు. రీసెంట్ గా తన తర్వాతి సినిమా క్రాక్ షూటింగ్ ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ఖిలాడీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే రవితేజ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన వర్కౌట్ వీడియోను షేర్ చేసాడు. స్వెట్, స్మైల్, రిపీట్ అని క్యాప్షన్ పెట్టగా ఆ వీడియోలో రవితేజ వర్కౌట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజకు 52 ఏళ్ళు. అయినా కానీ యువకుడిలానే బరువులు ఎత్తుతూ జిమ్ లో చేస్తున్న కసరత్తులకు వావ్ అనకుండా ఉండలేం. ఏదేమైనా ఇంతలా కష్టపడుతున్న రవితేజకు సక్సెస్ కూడా త్వరగా వచ్చేస్తే బాగుంటుంది కదా.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.