రానా వివిధ రంగాలలో తన వెర్సటైల్ వర్క్ ను చూపిస్తున్నాడు. నటుడిగా, సమర్పకుడిగా తన సత్తాను చాటుకున్న రానా రీసెంట్ గా సౌత్ బే లైవ్ అనే కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ను నెలకొల్పిన సంగతి తెల్సిందే. ఈ ఛానల్ లో ఇప్పటికే 28 దాకా వీడియోలు ఉన్నాయి. వివిధ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. అందులో వై ఆర్ యూ, అనే సెగ్మెంట్లో రానా కూడా ఉంటాడు. ప్రముఖుల ఇంటర్వ్యూలను డిఫెరెంట్ గా యానిమేటెడ్ స్టైల్ లో చేయడం ఈ సెగ్మెంట్ స్పెషలిటీ. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ వైన్ స్టైల్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుత ఎపిసోడ్ లో బిబి కి వైన్స్ పేరిట వీడియోలు చేసి పాపులర్ అయిన భువన్ బామ్ ను ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ అవుతోంది. ఇక రానా తన సినిమాలపై కూడా తన ఫోకస్ ను పెట్టాడు.