జవాన్ గా కనిపించనున్న రానా

రానా దగ్గుబాటి తెలుగు సినిమా హిరోల్లో క్రేజీ హిరో. వైవిద్యభరితమైన సినిమాలు, అటు టి.వి షోలు చేస్తూ అందర్ని అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రఖ్యాత తెలుగు సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్‌గాను అలరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలను పోషిస్తున్నాడు. అందులో భాగంగా డిస్కవరీ ప్లస్ వాళ్ళు రానా తో మిషన్ ఫ్రంట్ లైన్ షో ను తెరకెక్కిస్తున్నారు. ఇది డిస్కవరీ ప్లస్ లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లో రానా ఆర్మీ ఆఫిసర్, జైసల్మర్స్ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ గా కనిపించనున్నారు. ఈ షో ఫస్ట్ లుక్ ను షేర్ చేస్తూ రానా భావొద్వానికి లోనయ్యాడు. ఇది లైఫ్ టైం ఎక్స్‌ పీరియన్స్ జవాన్ గా నటించండం నిజంగా గొప్పగా, చాలా ఆనందంగా ఉంది అని రానా తన ట్విట్టర్ లో చెప్పకొచ్చాడు. రానా దగ్గుబాటి భాషలతో సంబంధం లేకుండా నటస్తూ తన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ అదరగొడుతున్నాడు. ఆర్మీ ఆఫిసర్ గా గన్ పట్టకున్న రానా దగ్గుబాటి లుక్ స్టన్నింగ్ గా వుంది. రానా సినిమాలు, షో చేస్తూ బీజీ షెడ్యుల్ లో ఉన్నాడు. రానా తెలుగులో ప్రస్తుతం విరాటపర్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.