రానా వ్యూహం అదిరింది.. ప్యాన్ ఇండియా వైడ్ గా వస్తున్నాడు

లీడర్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన రానా విభిన్న కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాహుబలి తర్వాత ఆ చిత్రంలో నటించిన అందరి రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ ఇప్పటికే సాహో అనే భారి ప్యాన్ ఇండియన్ మూవీ తీసి ఓ మోస్తారుగా పర్వాలేదనిపించే ప్రయత్నమే చేసాడు. ఇక తదుపరి సినిమాలు కూడా ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్నవే. ఇక రానా విషయానికి వస్తే ఇటీవలే ఆయన అరణ్య అనే మల్టీ లింగ్వల్ చిత్రాన్ని చేసారు.

అరణ్య చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ థియేటర్ల దగ్గర బోల్తా పడింది. అయన చేస్తున్న మరో చిత్రం విరాట పర్వం రీజనల్ లెవల్ కంటెంటే. ఇక ఆయన నుండి ప్యాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ గారు సీ. హెచ్ రాంబాబు గారితో కలిసి రానా కథానాయకుడిగా ఒక ప్యాన్ ఇండియన్ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

గోపీనాథ్ గారు ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించి ఉన్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన టాప్ హీరోకి ఆయనే నిర్మాత. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీ నటులు, చిత్రానికి పనిచేయబోయే టెక్నీషియన్స్ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం రానా చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ ప్రకటించారు. రానా తన తదుపరి సినిమాని ప్యాన్ ఇండియా వైడ్ గా చేస్తుండటంతో ఆయన అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.