మిషన్‌ ఫ్రంట్‌ లైన్‌ డాక్యుమెంటరీలో రానా

తెలుగులో విభిన్న కథలతో సినిమాలు చేస్తూ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి. ప్రస్తుతం తను నటించిన రెండు చిత్రాలు విరాట పర్వం, అరణ్య సినిమాలలో కూడా సరికొత్త పాత్రలలో రానా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు రానా దగ్గుపాటి ఒక డాక్యుమెంటరీ కూడా చేసారు. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ మీద డిస్కవరీ ప్లస్‌ ఒరిజినల్‌తో కలిసి మిషన్‌ ఫ్రంట్‌ లైన్‌ పేరుతో ఓ డాక్యుమెంటరీలో రానా కనిపించారు. భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకురానున్న ఆలోచనతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు, మిషన్‌ ఫ్రంట్‌ లైన్‌ పేరుతో రూపొందిన ఈ డాక్యూమెంటరీలో రానా ఆర్మీ గెటప్‌లో ఆకట్టుకోనున్నాడు. దీనిని తెరకెక్కించేందుకు స్వయంగా బీ.ఎస్‌.ఎఫ్‌ సాయాన్ని తీసుకొని పలు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ జనవరి 21 డిస్నీ ప్లస్‌ ఒరిజినల్‌లో విడుదలైంది. రానా, ఈ డాక్యుమెంటరీ కోసం పౌరులు ఉండే హై-సెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించడం నుంచి అక్కడ శిక్షణ తీసుకోవడం లాంటివి చేశారు. ఇక ప్రస్తుతం రానా, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళం సినిమా రీమేక్ లో నటించబోతున్నారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనా సహకారం చేయబోతున్నారు. ఈ మద్యనే ఈ సినిమా పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.