ప్రపంచం అంతా అభిమానులు ఉన్న ఫుడ్ బాల్ కి భారతదేశంలో కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. ప్రతీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఇండియన్ సూపర్ లీగ్ మన ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్ మన తెలుగు ప్రేక్షకుల దగ్గరికి కూడా రాబోతుంది. నవంబర్ 20 రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో మొదలుకాబోతున్న ఈ ఫుడ్ బాల్ లీగ్ కు ప్రముఖ కథానాయకుడు రానా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. క్రికెట్ ఆగిపోయినా కూడా ఆట ఆగదు అని కాప్షన్ తో రానా ప్రమోట్ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త నీతూ అంబానీ మొదలుపెట్టారు. ఈ పోటీలు మొదటగా 2014 అక్టోబర్ 12 న ప్రారంభమైనవి. కేరళ, ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా అనేక టీంలు ఈ ఇండియన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్నాయి. ఇక స్టార్ స్పోర్ట్స్ తెలుగు నుంచి రానా తో ఒక చిన్న ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోని రానా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.