There are almost a 100 million people with disabilities in India alone- comprising the world's largest minority. Post COVID, lets #BuildBackBetter, create a more accessible world.@ReetaRMGupta @ncpedp_india@MSJEGOI @socialpwds https://t.co/Hohqf7k9qX
— Rana Daggubati (@RanaDaggubati) December 3, 2020
రానా దగ్గుబాటి చూడటానికి భారీ కటౌట్ తో ఆకతాయిగా కనిపిస్తాడు కానీ చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. తను పుట్టినప్పటి నుండే ఆరోగ్య సమస్యలతో పుట్టానని, చిన్నప్పటి నుండి బీపీ ఉండేదని చెప్పి రానా షాక్ ఇచ్చాడు. వరస సినిమాలను లైనప్ చేసుకున్నాడు రానా. అరణ్య విడుదల కావాల్సి ఉంది. విరాటపర్వం బ్యాలెన్స్ పార్ట్ కోసం షూటింగ్ మొదలుపెట్టాడు. ఇక హిరణ్యకశ్యప చిత్రం చేయాల్సి ఉంది. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఈరోజు వికలాంగుల దినోత్సవం. దీని సందర్భంగా రానా దగ్గుబాటి సమాజానికి ఒక మంచి మెసేజ్ ను ఇచ్చాడు. #buildbackbetter అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా వికలాంగుల హక్కుల సమితి వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని కోసం రానా తన సందేశాన్ని ఇచ్చారు. "మిగిలిన వాళ్ళలానే వికలాంగులు కూడా సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. అయితే వారికి కావాల్సిందల్లా సౌలభ్యం, ఉత్పాదకం. ఇండియాలోనే 100 మిలియన్ లకు పైగా వికలాంగులు ఉన్నారు. వారికి మరింత సౌలభ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం" అని రానా అంటున్నాడు.