దీపావళి పండగ రోజున మెగా అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది. ఆకాశంలో బాణాసంచా మెరుపులు మెరుస్తుండగా, అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ ఒక్కొక్కరు చెరోసారి సెల్ఫీ దిగుతూ కనిపించారు. పండగ పూట అదిరిపోయే గిఫ్ట్ తో అభిమానులందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి చాక్లెట్ కలర్ జుబ్బాలో, రామ్ చరణ్ బ్లాక్ షర్ట్ లో చేతికి వాచీతో ఉన్నారు. రామ్ చరణ్ తండ్రితో సెల్ఫీ తీస్తుండగా ఈ ఫోటో ని క్లిక్ మనిపించారు. ఈ ఫోటోలో తండ్రి కొడుకులు చూడముచ్చటగా ఉన్నారు. రంగస్థలంతో రామ్ చరణ్, సైరాతో చిరు హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో రామ్ చరణ్ వస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య తెరకెక్కుతుంటే, రాజమౌళీ దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ రూపొందుతుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో పలకరించనున్నాయి.