రామ్ చరణ్ కి కొవిడ్ పాజిటివ్.

కరోనా పలువురు టాలీవుడ్ స్టార్స్ కి సోకిన విషయం తెలిసింది. రోజు రోజుకి కరోనా ఎంతోమందికి సోకుతోంది. అయితే చాలావరకు కరోన భారి నుండి కోలుకున్నారు. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సోకింది. రంగస్థలం సినిమాతో నటుడిగా తనేంటో నిరూపించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌తో కొన్ని రోజులుగా తీరిక లేకుండా ఉన్నాడు. చెల్లి నిహారిక పెళ్లి తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తండ్రి ఆచార్య సినిమాతో బిజీ అవుతున్నాడు. ఈ సినిమాకు ఈయన కేవలం నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా. ఇది అతిథి పాత్ర కాదు కీలక పాత్ర. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూరుస్తాయని నమ్మకం వ్యక్తం చేసాడు దర్శకుడు కొరటాల శివ. ఈ పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసాడు కొరటాల. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని పోస్ట్ చేశాడు. కానీ తనకు ఎలాంటి లక్షణాలు లేవు. క్వారంటైన్ లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాగే  తనని ఈ రెండు మూడు రోజుల్లో కలిసిన వారిని కొవిడ్ టెస్ట్ చేసుకోమని  సూచించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.