రవితేజతో రామ్ చరణ్ మల్టీ స్టారర్ చేస్తున్నాడా.. ఇంకో హీరో కూడా..?

రామ్ చరణ్ తేజ్ ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా లైఫ్ గడుపుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ , RRR సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఆచార్యలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు కూడా.. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రామ్ చరణ్ తేజ్ జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకోవాలనే మెగా అభిమానులు కోరుకుంటున్నారు.. అయితే ఇప్పటివరకూ తన తండ్రి సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు చెర్రీ.. ఖైదీ నెంబర్ 150 , సైరా ఇప్పుడు ఆచార్య సినిమాలు చేస్తూ వచ్చాడు..

ఈ నేపథ్యంలో బయట హీరోలని, తన ఫ్యామిలీ హీరోలను కూడా తన నిర్మాణంలో నటింపచేయాలని చూస్తున్నాడట రామ్ చరణ్.. ఈ నేపథ్యం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే రామ్ చరణ్ రవితేజతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు.. ఇందులో విజయ్ సేతుపతి మరో హీరోగా చేయనున్నాడట.. వీరికోసం మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మూవీ రీమేక్ రైట్స్ కొన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సినిమాను జీన్ పాల్ లాల్ తెరకెక్కించగా.. పృథ్వీరాజ్, సురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాక్ డౌన్‌లో సినిమా చూసిన చెర్రీ.. తెగ ఎంజాయ్ చేశాడట. ఆలస్యం చేయకుండానే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కొనేశాడట. అప్పట్లో బాబాయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదట. ఈ మధ్యే ఈ సినిమాలో వీరిని  తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చాడట.  పృథ్వీరాజ్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ, సురాజ్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసేశాడట. దీని గురించి ఇప్పటికే ఇద్దరితోనూ డిస్కషన్ కూడా చేశాడట.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.