‘ఆచార్య’తో కలిసిన ‘సిద్ధ’

మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఆచార్య సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన్ని సినిమా సెట్స్ లోకి స్వాగతిస్తూ ఆయన కోసం ఒక చిన్న పోస్టర్ ని విడుదల చేసారు మూవీ టీం. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. చెవికి పోగుతో రామ్ చరణ్ ని పూర్తిగా చూపించకుండా పోస్టర్ విడుదల చేసారు. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాల్లో చిరంజీవి గారు అతిధి పాత్రలు చేశారు. అలాగే చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ తో స్టెప్స్ వేసి అలరించాడు. అయితే మొదటిసారి రామ్ చరణ్ మెగాస్టార్ తో కలిసి కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక మ్యాట్నీ ఎంటర్టైమెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చెసి, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.