
రజినికాంత్ ఈ పేరు వింటే అభిమానులకే కాదు యావత్ భారత సినీ ప్రేక్షక లోకానికి పూనకాలు పుట్టుకోస్తాయి. స్టైల్ కి ఆయన మారు పేరు స్టైలే ఆయన పేరుని స్టైల్ గా చెప్తుంది. కేవలం భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. జపాన్ లో విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఇద్దరి నటుల్లో ఆయన ఒకరు. అక్కడి ప్రేక్షకులు ఆయన్ను రారాజుగా అభివర్ణిస్తారు.

అంత పేద్ద నటుడైనా ఎటువంటి హంగామా లేకుండా చాలా సాదా సీదాగా ఉంటారు. ఆయన సాధించిన విజయాలు ఎన్నో, ఆయన అధిరోహించిన శిఖరాలు ఎన్నెన్నో. ముఖ్యంగా ఆయన గురువు గారైన బాలచందర్ గారి సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూనే మరో వైపు కమర్షియల్ సినిమాలను చేసారు. కేవలం నటుడిగా మాత్రమె కాకుండా నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
ఇంతకు ముందు భారత ప్రభుత్వం అందించే పౌర పురస్కారు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేసింది. 2000వ సంవత్సరంలో పద్మ భూషణ్, 2016వ సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాలను ఆయన అందుకున్నారు. అయితే ఇపుడు మరో అరుదైన గౌరవాన్ని ఆయన అందుకున్నారు. చలనచిత్ర రంగంలో అయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనకు చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే ఆవార్డ్ ను ప్రకటించింది.