నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు ప్రిన్స్. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా ప్రిన్స్ మాత్రం తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ విజయం సాధించడంతో తనకు అవకాశాలు కూడా పెరిగాయి. ఇక అక్కడి నుండి అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరో పాత్రల నుండి క్యారెక్టర్ అవకాశాలకు కూడా సై చెప్పాడు. నేను శైలజ, మిస్టర్ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలు పోషించారు. ఇక ప్రిన్స్ బిగ్ బాస్ సీజన్-1 లో కూడా పాల్గొన్నాడు. అన్నిట్లో స్ట్రాంగ్ గా కనిపించిన ప్రిన్స్ అనుకోకుండా ఫైనల్ కు ముందు వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. The Prince Way పేరుతో ప్రిన్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టాడు. ఈ ఛానల్ 50 కె సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ప్రిన్స్ వ్లోగ్స్ కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. తన మొదటి వ్లోగ్ లో బాడీ షాట్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలి, తన వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుంది. ముందు రోజు ఏమేం చేస్తాడు అన్న విషయాలను పోస్ట్ చేసాడు. ఇలా రెగ్యులర్ గా వ్లోగ్స్ ను పోస్ట్ చేస్తానని అంటున్నాడు ప్రిన్స్.