నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రిన్స్ సిసిల్. అయితే బస్ స్టాప్ సినిమాతో తనకు బ్రేక్ వచ్చింది. అయితే సరైన అవకాశాలను ఎంచుకోవడంలో విఫలమైన ప్రిన్స్ చాలా త్వరగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సి వచ్చింది. అయితే ప్రిన్స్ అడపాదడపా వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నాడు. నేను శైలజ, అశ్వద్ధామ వంటి సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలతో తనకంటూ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ 1 ద్వారా ప్రిన్స్ కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. మొదటి నుండి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించాడు ప్రిన్స్. అయితే కొన్ని కారణాల వల్ల ఫైనల్స్ కు ముందు చతికిలపడ్డాడు. ఏదైతేనేం బిగ్ బాస్ తో తనేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా ప్రిన్స్ కు తనదైన అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా మళ్ళీ సినిమాలతో బిజీ అయిన ప్రిన్స్, తన నెక్స్ట్ సినిమా గురించి కీలక అప్డేట్స్ ను ఇస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ అనే పాత్రలో కనిపించనున్నట్లు, తనకు ఈ పాత్ర చాలా నచ్చినట్లు చెబుతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం ప్రిన్స్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి.