క్లాప్ టీం లో కొత్త ఉత్సాహన్ని నింపిన ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంతలా తన నటనతో టాలీవుడ్ లో అభిమానులని గెలుచుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ఇప్పుడు తాను చేస్తున్న సినిమా టీం లో కూడా కొత్త ఉత్సహాన్ని నింపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేస్తున్న చిత్రం క్లాప్. ఈ సినిమాలో ఆయనది ఒక ముఖ్యమైన పాత్ర. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. ప్రకాష్ రాజ్ రాకతో ఈ సినిమా టీం కి కొత్త ఉత్సాహం వచ్చిందట. అలాగే ప్రకాష్ రాజ్ కూడా మూవీ టీంతో కలిసి మాట్లాడుతూ, నవ్వుకుంటూ షూటింగ్ చేస్తున్న ఫొటోస్ నేట్టింట్లో తెగ తిరుగుతున్నాయి. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తున్న ఈ క్లాప్ సినిమాలో ఆకాంక్ష సింగ్ కథనాయిక‌గా నటిస్తుంది. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్, శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్,ఎక్స్-100, ద్రోణ369, మన్మథుడు-2 సినిమాలకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్ దానియల్ విశ్వాస్ లు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. కరోన వలన ఆగిపోయిన షూటింగ్ ఈ మధ్యనే మొదలై శరవేగంగా నడుస్తుంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.