Darling #Prabhas gifted wrist watches to #RadheShyam unit for Sankranthi pic.twitter.com/iRlbU4DQq6
— BARaju (@baraju_SuperHit) January 17, 2021
ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన రేంజ్ రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వరసగా భారీ బడ్జెట్ సినిమాలని ఒప్పుకుంటూ ప్రభాస్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ సినిమాలో నటించబోతున్నాడు. రాధే శ్యామ్ సినిమా మీద మూవీ టీం గత రెండు సంవత్సరాలగా పని చేస్తుంది. అయితే ప్రభాస్ ఇప్పుడు ఈ మూవీ టీంకి కాస్ట్లీ వాచెస్ ని బహుమతులుగా ఇచ్చి ఆయన అందరిచేత డార్లింగ్ అనిపించుకున్నాడు. ఇక రాధే శ్యామ్ సినిమాకి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లైలా - మజ్ను, పారు - దేవదాస్ లాంటి అధ్బుతమైన ప్రేమ కావ్యంగా రాబోతున్న ఈ రాధే శ్యామ్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.