పవన్ కి కరోనా టెస్ట్.. రిపోర్టు ఎలా ఉందంటే..!!

కరోనా తన మలిదశ విజృంభణని మొదలుపెట్టింది. తొలిదశలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేయగా ఇప్పుడు మళ్ళీ ఏ డ్యామేజ్ చేయబోతుందో అని ప్రపంచ మేధావులు తలలు పట్టుకున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణ మాములుగా లేదు. గతంలోకంటే ఇప్పుడు కరోనా విస్తరణ ఎక్కువైపోయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా విజృంభణ ఇంకా ఎక్కువగా ఉంది.. ఇప్పుడు దాదాపు రెండు లక్షల కేసులు నమోదు కావడంతో మళ్ళీ కరోనా ఏ కొంప ముంచుతుందో అని అందరు టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుంది.. అయితే వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా ఈ కరోనా తిరిగి ఎటాక్ అవుతుంది.. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో .. ఇకపోతే ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది క్యూ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. కాగా ఈ చిత్ర బృందంలో కొంతమంది కి కరోనా రాగా కొన్ని రోజులుగా పవన్ క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా అయన కూడా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చింది.

దీంతో ఫ్యాన్స్ అంతా కంగారు పడుతున్నారు. పవర్ స్టార్ కు కరోనా పాజిటివ్ రాకూడదని పొద్దుటి నుంచి ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పూజలు చేశారు. రాజకీయల కోసం మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. గత వారమే ‘వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. ‘పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా రికార్డులు ఇప్పట్లో ఆగేలా లేవు..

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.