అరుకు ఆదివాసులని కలిసిన పవన్ కళ్యాణ్

అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన విభిన్నత చూపిస్తారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఒక చిన్న విరామం ఇచ్చి సినిమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికరమైన వీడియోని పోస్ట్ చేసారు. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ కోసం ఆయన అరుకులో ఉన్నారు. అయితే అక్కడ ఉన్న ఆదివాసులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. "నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో, అడవితల్లితో ముడిపడ్డ ఆంధ్ర-ఒరియా అరకు ఆదివాసీల జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకువచ్చింది" అని ట్విట్టర్ ద్వారా ఆదివాసుల పాటని పోస్ట్ చేసారు. ఇక ఆయన చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ శర వేగంగా నడుస్తుంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో కలిసి ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇంక ఈ మద్యనే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం ఈ మద్యనే జరిగింది. అప్పట్లో ఒకడుఉండేవాడు సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.