పవర్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు

హీరోల కెరీర్లు నిలబడేది హిట్ల మీద ఆధారపడే. వారి మార్కెట్ పెరగాలన్నా, ఒక ప్రొడ్యూసర్ వారితో సినిమా తీయడానికి ముందుకి రావాలన్నా వాళ్ళు చేసే సినిమాలు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త హీరోకి అభిమానులు ఏర్పడాలంటే అతని సినిమాలు తప్పకుండా హిట్ అవ్వాల్సిందే.

పవన్ కళ్యాణ్ ఈ పేరుకి అసలు పరిచయమే అవసరం లేదు. ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. మెగాస్టార్ తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ సొంత గుర్తింపుని ఏర్పరచుకున్న నటుడు పవన్ కళ్యాణ్. అయన కెరీర్లో మొదటి ఏడు సినిమాలు వరసగా హిట్ అయ్యాయి. అప్పటికి ఏ హీరోకి మొదటి సినిమా నుంచి వరసగా ఏడు హిట్లు లేవు. దాంతో అయన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు వచ్చిన ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

అయితే అసలు ఆయనకు ఇంత ఫాలోయింగ్ రావడానికి ముఖ్య కారణం మాత్రం తొలిప్రేమ చిత్రమే. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పటి వరకూ యువతకు మాత్రమె చేరువగా ఉన్న ఆయన్ను ఫ్యామిలి ఆడియెన్స్ కి కూడా దగ్గర చేసింది. పవన్ కెరీర్లో అది మర్చిపోలేని మరో సినిమా ఖుషి. ఈ సినిమా ఆయన క్రేజ్ మరింత పెరిగేందుకు ఉపయోగపడింది. ముఖ్యంగా ఖుషి సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఖుషి తర్వాత దాదాపు పదేళ్ళు సరైన హిట్ లేదు. మధ్యలో జల్సా ఒక మోస్తారుగా పర్లేదు అనిపించింది.

ఎన్నో ఆశలతో వచ్చిన పంజా సినిమా కూడా నిరాశపరిచింది. పవన్ ఎప్పుడు హిట్ కొడతాడో అని అందరూ అనుకుంటున్న టైంలో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇక పవన్ పని అయిపోయింది అని అన్నోళ్ళ నోళ్ళకు తాళం వేసింది ఈ చిత్రం. ఆ సినిమా హిట్ తో ఫ్యాన్స్ లో మళ్ళీ ఉత్సాహం.

హిట్ ట్రాక్ మెయిన్టైన్ చేస్తూ అత్తారింటికి దారేది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తో అభిమానులను పలకరించాడు పవన్. యధావిధిగా ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన హిట్ కొట్టలేదు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న వకీల్ సాబ్ పైనే ఫ్యాన్స్ ఆశలు అన్నీ మరి ఏమౌతుందో వేచి చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.