యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ వంటి సూపర్ హిట్ తర్వాత తిరిగి లైన్లో పడిన విషయం తెల్సిందే. నితిన్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు. తన తర్వాతి సినిమా రంగ్ దే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రాన్ని కూడా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇలా వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు బ్రాండ్ అంబాసడర్ గా కూడా మారిపోయాడు. నితిన్ స్నేహ ఫ్రెష్ చికెన్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ యాడ్ ప్రోమో ఈరోజు విడుదలైంది. ఈ యాడ్ నితిన్ లుక్ చాలా బాగుంది. పైగా ఈ యాడ్ షూట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటోంది. చికెన్ లేని కిచెన్ ఏంటి అని నితిన్ క్యాప్షన్ గా ఈ యాడ్ కు వాడాడు. ఈ యాడ్ లో నటి ప్రగతి కూడా ఉన్నారు. ప్రతీ అమ్మ పిల్లలు తిన్నారా లేదా అనే ఆలోచిస్తుంది, అందుకే ప్రతీ అమ్మ కిచెన్ లో స్నేహ చికెన్ అని ప్రచారం చేస్తున్నాడు నితిన్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.