
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సెలబ్రిటీల మధ్య బాగా ఫేమస్ అవుతూ ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారు. దానిని పూర్తి చేసిన తర్వాత వేరే వాళ్ళకు ఈ ఛాలెంజ్ విసురుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, రాజమౌళి, రామ్ చరణ్ వంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశారు. తాజాగా కార్తికేయ, స్వామి రారా సినిమాల కథనాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కి నటుడు రాజా రవీంద్ర ఈ ఛాలెంజ్ ని విసిరారు. దాంతో నిఖిల్ ఈ ఛాలెంజ్ ని తీసుకుని గచ్చిబౌలి లోని అవతార్ నివాస గృహ సముదాయంలో మూడు చెట్లను నాటారు. నిఖిల్ మాట్లాడుతూ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుందని. మనం స్టాలిన్ సినిమాలో చూశాం ఒకరు ముగ్గురికి సహాయం చేయాలని అదే విధంగా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయాలనే విధంగా సంతోష్ అన్న చేపట్టిన కార్యక్రమం చాలా వినూత్నంగా ఉందని గతంలో కూడా సీడ్ గణేష్ పేరు మీద పర్యావరణ పరిరక్షణ కోసం తన కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగిందని. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం సంతోష్ అన్న చేపట్టిన కార్యక్రమం చాలా అధ్బుతంగా ముందుకు పోతుందని తెలిపారు. కాబట్టి ఈ ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నేను నా నూతన చిత్రం 18 పేజేస్ చిత్ర బృందం సభ్యులను అదే విధంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, అవికా గౌర్, కలర్ స్వాతి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని” తెలిపారు.
.@actor_Nikhil accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
— BARaju (@baraju_SuperHit) November 17, 2020
from @Rajaraveendar Planted 3 saplings. Further He nominated #18pages entire team @anupamahere #avikagor @swati_colors
to plant 3 trees & continue the chain.special thanks to @MPsantoshtrs for taking this intiate pic.twitter.com/DAxPI8RfW2