
న్యాచురల్ స్టార్ నాని సినిమాలలో ఎంత బిజీగా ఉన్న తన ఫామిలీ కి మాత్రం ఎప్పుడు తన సమయం కేటాయిస్తారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన కొడుకు జున్ను ,తన భార్య అంజనా గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక నవంబర్ 23న నాని భార్య అంజనా పుట్టినరోజు సందర్బంగా నాని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అంజనాకి శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రయాణంలో నువ్వు మంచి కంపెనీ అని నాని, అంజనా ఫ్లైట్ లో కలిసి దిగిన ఫోటో ని పోస్ట్ చేసారు. ఇక నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మొదలుకాబోతుంది. ఈ మధ్యనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నానికి జోడిగా మలయాళం తార నజ్రియా ఫహాద్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది.