ప్యాన్ ఇండియా మార్కెట్ వైపుగా నాని అడుగులు...

విభిన్న కథా చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరచుకున్న నటుడు నాని. తన సహజమైన నటనతో, హావభావాలతో న్యాచురల్ స్టార్ గా పేరొందాడు. ఆయన ఎంచుకున్న సినిమాలు ఆయన నటన చూస్తే ఈ విషయం ఎవరికైనా తెలుస్తుంది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రెండు హిట్ సినిమాలను తీసి సక్సెస్ ఫుల్ ట్రాక్ ని నిర్మించుకుంటున్నారు. ఆయన నిర్మించిన అ!, హిట్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసినట్లు తెలుస్తోంది.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కనున్న హిట్ – 2 లో హీరోగా నటుడు, రచయిత అడివి శేష్ ను తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో హీరోగా చేసిన విశ్వక్ కి బదులుగా శేష్ ను తీసుకోవడంలో ఆయన ఆలోచన ఏమిటి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయం పై చాలా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసలు విషయం ఏంటి అనేది నాని సన్నిహితులు ద్వారా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

అడివి శేష్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు మేజర్, గూఢచారి-2. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు గూఢచారి-2 కూడా ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతోంది. మేజర్ రిలీజ్ తర్వాత అడివి శేష్ మార్కెట్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఇంకా పెరుగుతుంది. కాబట్టి హిట్-2 కి ప్యాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకని మార్కెట్ దృష్ట్యా శేష్ ని హీరోగా తీసుకున్నారని టాక్. మేజర్ చిత్రీకరణ పూర్తైన తర్వాత హిట్-2 షూటింగ్ మొదలు కానుంది.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.