మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ను బుక్ చేసారు. ఇక నిహారిక పెళ్ళి కార్యక్రమాలు అన్నీ మంచి హడావుడితో జరుగుతున్నాయి. నిన్న ఉదయమే మెగా ఫ్యామిలీ మొత్తం చార్టెడ్ ఫ్లైట్స్ లో రాజస్థాన్ కు చేరుకున్నారు. చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడు. ఆయన పెళ్ళికి వస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమం మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినట్లు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ చేస్తోన్న పోస్ట్ లను బట్టి అర్ధమవుతోంది. ఇక నాగబాబు సంగీత్ లోని ఒక చిన్న బిట్ వీడియోను పోస్ట్ చేసాడు. అందులో నాగబాబు, రామ్ చరణ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ తదితరులు అందరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.