#Sashi Teaser launched by MEGASTAR @KChiruTweets
— BARaju (@baraju_SuperHit) December 23, 2020
Here it is ▶️ https://t.co/wzKSPKq9Os#AadiSaiKumar @Surbhiactress @rashis276 #SrinivasNaidu @Arunchiluveru @Amar_Bommireddy @rpvarmadatla @SHMovieMakers @adityamusic pic.twitter.com/Vcbmwwic6d
మెగాస్టార్ చిరంజీవి ఇతర హీరోల చిత్రాలను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. చిరు రీసెంట్ గా ఆది నటించిన శశి సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. ఆది గత కొంత కాలంగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చేస్తోన్న చిత్రం శశి. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సురభి నటించింది. అరుణ్ చిలువేరు సంగీతం అందించాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ ను లాంచ్ చేయడం విశేషం. ఇక టీజర్ విషయానికొస్తే ఆది ఒక ప్రామిసింగ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడని క్లియర్ గా అర్ధమైపోతుంది. ఈ చిత్రంలో ఆది లుక్స్ బాగున్నాయి. ఇక లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచారు. ప్రధానంగా ఈ సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. "మన చివరి క్షణాలను చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తుకువస్తాయి" వంటి డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి. త్వరలోనే శశి విడుదల కానుంది.