
లాక్ డౌన్ తర్వాత మెగాస్టార్ వేగం పెంచారు. ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్ మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అలాగే తన తదుపరి చిత్రాలని కూడా అయన సత్వరమే పట్టాలెక్కించేందుకు సిద్ధమౌతున్నారు. ఆచార్య చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నారు అంటే ఆయన మే కల్లా ఫ్రీ అయిపోతారు కాబట్టి ఆచార్య షూటింగ్ పూర్తవగానే తన తర్వాతి సినిమాని మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మేకర్స్.

మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’. హనుమాన్ జంక్షన్ సినిమాతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు మోహన్ రాజా. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో అయన సినిమా చేయలేదు. దాదాపు 20 సంవత్సరాల తర్వత మళ్ళీ తెలుగులో, అది కూడా మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మలయాళ మాతృకకి చిరంజీవి శైలికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి కథని ఫైనల్ చేసేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించే ఇతర ముఖ్యపాత్రల గురించి ఇంకా వివరాలేవీ తెలియలేదు.

ఈ చిత్రంలో కథానాయకుడి చెల్లెలి పాత్ర చాలా కీలకమైంది కాబట్టి ఆ పాత్రకు సరిగ్గా యాప్ట్ అయ్యే నటి కోసం చిత్రబృందం తెగ గాలిస్తోంది. మలయాళంలో అ పాత్రను మంజు వారియర్ చేసారు. తెలుగులో కూడా ఆ పాత్రకు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ముందుగా ఆ పాత్రను సాయి పల్లవి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఆమె డేట్స్ కుదరక చేయట్లేదు అని కూడా పుకార్లు పుట్టించారు. ఇప్పుడు ఆ పాత్రను నయనతార చేయనుంది అని వార్తలు వచ్చాయి. మరి అది నిజమో కాదో తెలీదు. ఆ పాత్ర ఒక్కటి ఫైనల్ అయితే దర్శకుడు మరే టెన్షన్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టేసుకోవచ్చు మరి ఆ పాత్రను ఎవరు చేస్తారో వేచి చూడాలి.