— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020
కరోనా వైరస్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతోంది. ఈ మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి సామాజిక దూరం, ముఖానికి మాస్క్, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి అని వెల్లడించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఉదయం తనకు కోవిడ్ సోకిందని, అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని తెలియజేసాడు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని రామ్ చరణ్ వెల్లడించాడు. అలాగే గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ టెస్ట్ చేయించుకోవాలని కోరాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ కజిన్ వరుణ్ తేజ్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అయితే త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతుడిని అవుతానన్న నమ్మకం ఉందని వరుణ్ తేజ్ తెలియజేసాడు. వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తోన్న చిత్ర షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు. తన మరో చిత్రం ఎఫ్ 3 సెట్స్ పై ఉంది.