షర్ట్ లెస్ గా బీస్ట్ మోడ్ లో మంచు విష్ణు

మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పూర్తయింది. అయినా కానీ ఇంకా హీరోగా తనదైన మార్కెట్ సాధించలేదు. అడపాదడపా మంచి సినిమాలు వచ్చినా క్రమం తప్పకుండా వచ్చిన ప్లాపులతో మంచు విష్ణు కెరీర్ టాప్ రేంజ్ కు వెళ్ళలేదు. అయితే కామెడీ ఎంటెర్టైనెర్స్ చేయడంలో విష్ణు తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. తాను కొట్టిన హిట్స్ లో మాగ్జిమమ్ కామెడీ ఎంటెర్టైనెర్స్ ఉన్నాయి. వరస ప్లాపుల తర్వాత కెరీర్ నుండి కొంత బ్రేక్ తీసుకున్న మంచు విష్ణు ప్రస్తుతం ‘డీ అండ్ డీ’ సినిమా కోసం సమాయత్తమవుతున్నాడు. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్లాపులలో ఉన్న ఈ ఇద్దరికీ ఈ చిత్ర విజయం చాలా ముఖ్యం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే మంచు విష్ణు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన షర్ట్ లెస్ ఫోజు బాగా వైరల్ అయింది. ఈ షర్ట్ లెస్ ఫోటోలో మంచు విష్ణు తన కూతురు ఐరా విద్య మంచును ఎత్తుకుని తనవైపు ప్రేమగా చూస్తూ నిలబడడం చాలా ముచ్చటగా ఉంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.