Quality Time spent with family is worth every second. ✨ Don't you guys agree?
— Lakshmi Manchu (@LakshmiManchu) December 9, 2020
Swipe to see some morning shenanigans at the Manchu House! ❤️
Adore our mornings, little fun with Nivi & lots of pampering from Nana! Love it..👨👩👧♥️ pic.twitter.com/SUbQOOnNYY
ప్రముఖ నటుడు మోహన్ బాబు గారికి తన కూతురు మంచు లక్ష్మి అన్నా మనవరాలు నివి అన్నా చాలా ఇష్టం అని మన అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు లక్ష్మీ మంచు మరోసారి తన నాన్న తో ఉన్న బంధాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. "ఫ్యామిలీ తో స్పెండ్ చేసిన ప్రతీ సెకండ్ చాలా ముఖ్యమైనది అని దానికి మీరు కూడా అంగీకరిస్తారా అని", మంచు హౌస్ లో మోహన్ బాబు గారు, మంచు లక్ష్మి, నివి కలిసి అల్లరి చేస్తూ దిగిన ఫొటోస్ తన సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకుంది. ఈ ఫోటోస్ లో మోహన్ బాబు గారు నివి తో సరదాగా అడుకున్నారు. ఇక లక్ష్మీ మంచు ప్రస్తుతం రానా దగ్గుపాటి సౌత్ బే లైవ్ ఛానల్ లో కమింగ్ బాక్ టూ లైఫ్ అనే ఎపిసోడ్స్ లో సరదాగా సెలెబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే తను తాప్సి తో, సానియా మీర్జా తో కలిసి చేసిన ఇంటర్వ్యూస్ సౌత్ బే లైవ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇక త్వరలోనే ఎస్.ఎస్ రాజమౌళి తో ఇంకా ఇండియాలో ఉండే ఫ్యాషన్ డిజైనర్లు అలాగే పాపులర్ సెలెబ్రిటీస్ తో మంచు లక్ష్మి సరదా ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ వీడియోస్ సౌత్ బే ఛానల్ లో త్వరలోనే రాబోతున్నాయి.