ఆ పాట విషయంలో ఇప్పుడే చాలా ఆనందంగా ఉంది

3 సంవత్సరాలుగా సినిమాల నుంచి విశ్రాంతి తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్న మంచు మనోజ్ చేసిన ‘కరెంట్ తీగ’ సినిమాలో ఒక పాట చాలా సంతృప్తి ఇచ్చింది అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఎందుకంటే ఒక ముగా అమ్మాయి ‘పిల్ల ఓ పిల్ల’  పాటని పాడటానికి ప్రయత్నస్తూ హమ్ చేస్తున్న ఒక వీడియోని మనోజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “ఈ వీడియో నా గుండెని కరిగించింది, ఈ పాట హిట్ అయినప్పుడు కన్నా ఇప్పుడే ఇంకా ఆనందంగా ఉంది” అని ఆయన అన్నారు. ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి సంగీతం అందించిన అచ్చు గారికి ప్రత్యేకంగా అభినందించారు. మనోజ్ ఇలాగే చాలా సార్లు తన మంచితనాన్ని చాటుకున్నారు. ఒకసారి బోన్‌ కేన్సర్‌ బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు. అతనికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. లాక్‌డౌన్‌లో కూడా మనోజ్ వలస కార్మికులకు సాయం చేశాడు. సొంత డబ్బులతో కార్మికులను ఊళ్లకు పంపించాడు. ఇక తాజాగా ఆయన నిర్మాతగా మారి తన పేరు మంచు మనోజ్ కలిసొచ్చేలా  ఎం.ఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. ఈ బ్యానర్‌లో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో కొత్త సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసాడు. ఈ  చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.