With all precautions in place, we’re glad to announce AMB Cinemas is back! Book your tickets online on BookMyShow and treat yourself to a 5-star movie experience! Book here: https://t.co/T81ZfVw6hC #Reopening #TimeForAction #AMBIsBack #AMBMovieExperience #MovieMagic #AMBCinemas pic.twitter.com/v29upCt4NX
— AMB Cinemas (@amb_cinemas) December 1, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. గతేడాది ఈ మల్టీప్లెక్స్ ను మహేష్ ప్రారంభించగా విజయవంతంగా ప్రదర్శించబడింది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ ఉపద్రవం వల్ల ఈ మల్టీప్లెక్స్ గత ఎనిమిది నెలలుగా మూసివేయబడి ఉంది. తెలంగాణలో ఈ థియేటర్స్ ను డిసెంబర్ నుండి మొదలుపెట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీప్లెక్స్ ను డిసెంబర్ 4 నుండి పునఃప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు. డిసెంబర్ 4న భారతదేశంలో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన టెనెట్ చిత్రం విడుదల కానుంది. భారతదేశంలో ఈ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఏఎంబి సినిమాస్ ‘టెనెట్’ అడ్వాన్స్ బుకింగ్ ను కూడా మొదలుపెట్టింది. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ ను విక్రయించడం ప్రారంభించారు. కరోనా ద్వారా కుదుపులకు లోనైన అందరి జీవితాలు నెమ్మదిగా నార్మల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు కూడా మళ్ళీ ఇదివరకటిలా సందడి చేయాలని కోరుకుందాం.