

సూపర్ స్టార్ మహేష్ తన భార్య పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళి వచ్చి తన ఇంటిలో రిలాక్స్ అవుతున్నాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహేష్ తో సితార ఎంజాయ్ చేస్తున్న పోటోలు నమ్రత ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన ఫోటోలు షేర్ చేసింది. నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన రెండు ఫోటోలు అభిమానులను ముచ్చట గొల్పుతున్నాయి. ఈ ఫోటోలో మహేష్ బాబు కూతురు సితార మహేష్ బాబు నుండి ఫోన్ లాక్కుంటుంది. మహేష్ తన సెల్ ఫోన్ లో ఎదో ఒక ఫోటో చూస్తున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించిన సితార మహేష్ దగ్గర నుండి ఆ సెల్ ఫోన్ ను లాక్కోవడానికి ప్రయత్నించింది సితార తండ్రి నుండి ఫోన్ తీసుకుంటుండగా ఈ ఫోటోలు కాప్చర్ చేశారు. నమ్రత శిరోద్కర్ ఈ ఫోటోల గురించి “ ఇద్దరూ క్యూటీ లు యాక్షన్ లో ఉన్నారు. తండ్రి కుతురికి కారణాలు చెప్పడానికి ప్రయత్నించిన చివరికి కుతురి డిమాండ్స్ కి ఒప్పుకోక తప్పలేదు. నెక్స్ట్ జెనరేషన్ స్మార్ట్ కిడ్స్” అంటూ చెప్పుకొచ్చింది. నమ్రత శిరోద్కర్ పెట్టిన ఈ సరదా పోస్ట్ కి మహేష్ బాబు అభిమానులు లైక్స్, కామెంట్స్ తో ఇన్స్టాగ్రామ్ ని నింపేసారు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా లో నటిస్తున్నాడు