మొన్న వారు చేసారు..ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోన గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న పెద్ద, పేదా ధనిక అనే తేడాలు లేకుండా అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది. ఎందరో సెలబ్రిటీలు సైతం కరోన భారిన పడిన విషయం తెలిసిందే. కాని చాలా మంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారు. మాస్కులు పెట్టుకోకుండానే తమ ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. వారి వల్ల ఇతరులకు కూడా ఎంతో నష్టం వాటిల్లుతోంది. అందుకనే పరిశ్రమలోని వారు ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఒకొక్కరిగా ముందుకు వస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయంపై స్పందిస్తూ “రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. జనసంచారం ఉన్న ప్రదేశాల్లో దయచేసి మీరు మీ మాస్కులను ధరించడం మర్చిపోకండి. అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి. ఒకవేళ మీకు కరోన సోకినట్లయితే సెల్ఫ్ ఇసోలేషన్ లో ఉండండి. క్రమం తప్పకుండా కరోన లక్షణాలను చెక్ చేసుకుంటూ ఉండండి. వైద్యుల సూచనలను తప్పక తీసుకుని వారు తప్పనిసరి అంటేనే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. దాని వల్ల అత్యవసరం ఉన్న వారికి బెడ్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ మహమ్మారిని మనం ఎదుర్కొంటాం అని నేను నమ్ముతున్నాను. క్షేమంగా ఉండండి”. అని ట్వీట్ చేసారు.

మొన్నామధ్య ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ కూడా ఒక వీడియో చేసిన విషయం తెలిసిందే. తారక్, చరణ్, రాజమౌళి, అజేయ్ దేవగణ్, ఆలియా భట్ లు ఒకొక్క భాషలో కోవిడ్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరగా ముంగించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం లాంచ్ అవుతుందని సమాచారం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.