Super star @urstrulyMahesh to launch the first glimpse of #ThankYouBrother on 24th Dec.
— BARaju (@baraju_SuperHit) December 23, 2020
Stay tuned!
⭐ing @anusuyakhasba @viraj_ashwin @monie_kaa @harshachemudu @anishkuruvilla
🎬 @Raparthy
🎥 @sureshragutu1
🎼 @gunasekaran_gm
💰 @MaguntaSarath in @JustOrdinaryEnt#TYB pic.twitter.com/GLsYf91dL4
బుల్లితెరపై తన గ్లామర్ తో సందడి చేసే అనసూయ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. రంగస్థలం సినిమాతో ఆమెకు విపరీతమైన ఫేమ్ వచ్చింది. అయినా చాలా జాగ్రత్తగా తన సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. అనసూయ నటించిన తాజా చిత్రం థాంక్యూ బ్రదర్. ఈ సినిమాలో అనసూయ గర్భవతి పాత్రలో కనిపించనుంది. విరాజ్ అశ్విన్ ఆమెకు బ్రదర్ పాత్రలో కనిపిస్తాడు. ఇక మౌనిక రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ బొమ్మి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. గుణ బాల సుబ్రహ్మణియన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 24న మహేష్ చేతుల మీదుగా ఈ చిత్ర మొదటి టీజర్ విడుదల కాబోతున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక థాంక్యూ బ్రదర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.