సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెళ్ళి అయ్యాక సినిమాల్లో హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫ్యామిలికి సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కరోన వలన బయటకి రాలేకపోయిన సూపర్ స్టార్ ఫ్యామిలి ఇప్పుడు అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో డిన్నర్ చేస్తోన్న ఫోటోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మన ముందుకు రాబోతున్నారు. మహేష్ బాబు తన సొంత సంస్థ నుంచి అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా నిర్మిస్తున్నాడు. 26/11 దాడుల్లో అమరుడైన ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మరోవైపు మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించబోతున్నారు మహేష్ బాబుకి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.