మహేష్ బాబు వ్యాన్ ఎలా ఉందో చూశారా..అది బస్సా..5 స్టార్ హోటలా?

టాలీవుడ్ హీరోలు ఎం చేసినా ఈ మధ్య దేశం మొత్తం ట్రెండ్ అయిపోతుంది.. వారు వేసుకునే చెప్పుల దగ్గరి నుంచి తిరిగే కారు వరకు అన్నీ గొప్పగా చెప్పుకుంటున్నారు వారి వారి అభిమానులు.. మా హీరో ఈ బ్రాండ్ వేసుకున్నాడు అంటే ఈ టాప్ బ్రాండ్ వేసుకున్నాడు అని అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ మధ్యనే కొన్న వ్యానిటి వ్యాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.

మహేష్ బాబు వేసుకునే  డ్రెస్ విషయం నుంచి కాళ్లకు వేసుకునే షూస్.. చేతికి పెట్టుకునే వాచ్ అన్నింటి గురించి ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు.. నిర్మాతలు ఏర్పాటు చేసే వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించేవారు. కానీ రీసెంట్‌గా తన అభిరుచికి తగ్గట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అందులో అన్ని రకాలు సదుపాయాలున్నాయి.

ఇక మహేష్ బాబు సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న మహేష్ ఈ సినిమాను కూడా అదే విధంగా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో కమర్షియల్ స్టార్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.